ఎస్సీ రుణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ABN , First Publish Date - 2020-12-20T03:30:52+05:30 IST
ఎస్సీలకు రుణాలను అందించేందుకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల సహకార అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ పేర్కొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ డీడీ కస్తాల
ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు19: ఎస్సీలకు రుణాలను అందించేందుకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల సహకార అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ పేర్కొన్నారు. 21నుంచి టీఎస్‌ఓబీఎంఎం ఎస్.సీజీజీ. జీవోవీ.ఐఎన్ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నెలరోజులు లోపుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎస్సీలకు 2020-21 సంవత్సరానికి ఈ రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల వారు ఏడాదికి ఆదాయం రూ.1.5లక్షల లోపు, పట్టణ ప్రాంతంలో మాత్రం ఏడాదికి రూ.2లక్షల లోపు ఆదాయం ఉండాలని పేర్కొన్నారు. వయస్సు 21నుంచి 50 సంవత్సరాల ఉండాలన్నారు. వ్యవసాయేతర పథకాలకు మాత్రం వయస్సు మరో పదేళ్లు సడలింపు ఉంటుందన్నారు. గతంలో రుణాల పొందిన వారు తిరిగి దరఖాస్తు చేయాలంటే ఐదేళ్లు కాల వ్యవధి ఉండాలని తెలిపారు. రుణాలను పారదర్శకంగా అందించేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ విధానం ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా పుస్తకాలు వెంట తీసుకేళ్లాలని తెలిపారు. యూనిట్లు, సబ్సిడీ ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయని వివరించారు.