సన్నాలకు రూ.2500 చెల్లించాలి: బీజేపీ ఆందోళన

ABN , First Publish Date - 2020-12-12T04:47:45+05:30 IST

బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మధిరలో సన్నరకం వడ్లకు ఽరూ. 2500 గిట్టుబాటుధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆపార్టీ కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

సన్నాలకు రూ.2500 చెల్లించాలి: బీజేపీ ఆందోళన
మధిరలో ప్రదర్శన నిర్వహిస్తున్న కార్యకర్తలు

అన్నదాతలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

మధిర, డిసెంబరు 11: బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మధిరలో సన్నరకం వడ్లకు ఽరూ. 2500 గిట్టుబాటుధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆపార్టీ కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్షరూపాయల రుణమాఫీ అమలుచేయాలని, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు పాపట్ల రమేష్‌, గుండా శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు చిలువేరు సాంబశివరావు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి నాగేశ్వరరావు, కాసిన నాగభూషణం, మిక్కినేని కృష్ణ, డీవీఎన్‌ సోమేశ్వరరావు, కుంచం కృష్ణారావు, బియ్యవరపు రామకృష్ణ, బిల్లేపల్లి చిట్టిబాబు, పగడాల నాగేంద్రబాబు, కోనా నరసింహారావు, బీ నాగబూషణం, మాధవసాయి తదితరులు పాల్గొన్నారు. 

సత్తుపల్లిరూరల్‌: రైతు పండించిన సన్న వరి క్వింటాకు రూ.2500తో పాటు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ సీనియర్‌ నాయకులు ఉడతనేని అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించిన వినతిపత్రం అందజేశారు.

ఎర్రుపాలెం: అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం తహసీల్దార్‌ జగదీశ్వర్‌ప్రసాద్‌కువినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు కోటేశ్వరరావు, తిరుపతిరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

తల్లాడ/పెనుబల్లి:  అన్నదాతల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం తల్లాడ మండలశాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఆపతి వెంకటరామారావు, యుద్దనపూడి శ్రీనివాస్‌, గాదె కృష్ణారావు, తొండపు మధు, వాడవల్లి నాగేశ్వరరావు, గొల్లమందల నరేష్‌, పులగర పిచ్చయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-12-12T04:47:45+05:30 IST