సమాజాభివృద్ధిలో యువత ముందుండాలి

ABN , First Publish Date - 2020-11-27T05:36:33+05:30 IST

సమాజాభివృద్ధిలో యువత ముందుండాలని సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అన్నారు.

సమాజాభివృద్ధిలో యువత ముందుండాలి
కిట్టు పంపిణీ చేస్తున్న సీఐ

దుమ్ముగూడెం నవంబరు 26: సమాజాభివృద్ధిలో యువత ముందుండాలని సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని చినకమలాపురం, సుజ్ఞానపురం గ్రామాల్లోని ఆదివాసీ యువతకు గురువారం వాలీబాల్‌ కిట్లను అందజేశారు. యువత పెడమార్గం పట్టకుండా, చదువులు, క్రీడల్లోనూ రాణించాలని ఆశించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రవికుమార్‌, సీఆర్‌పీఎఫ్‌ జీ39 ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Read more