నేటినుంచి సాగర్‌ జలాల విడుదల

ABN , First Publish Date - 2020-12-16T04:44:20+05:30 IST

ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో యాసంగి సాగుకు గాను బుధవారం పాలేరు జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు.

నేటినుంచి సాగర్‌ జలాల విడుదల

కూసుమంచి, డిసెంబరు 15: ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో యాసంగి సాగుకు గాను బుధవారం పాలేరు జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జలాశయం అవుట్‌ఫాల్‌ గేట్లను ఎత్తి ఎస్‌ఈ సుమతీదేవి నీటిని విడుదల చేయనుండగా.. ఈమేరకు ఎన్నెస్పీ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని సుమారు 2.5లక్షల ఎకరాల్లో వరి, ఆరుతడి పంటలు సాగుకానుండగా.. వారబందీ పద్ధతిన 30 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. అయితే మొదటి జోన్‌నుంచి పాలేరుకు 2వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 23 అడుగులకు కాగా ప్రస్తుతం కేవలం 16.8 అడుగులమేర మాత్రమే నీరు ఉంది. . బుధవారం నుంచి రెండోజోన్‌కు నీరు విడుదల చేస్తుండటంతో నీటిమట్టం మరింత తగ్గే అవకాశం ఉంది. 


Updated Date - 2020-12-16T04:44:20+05:30 IST