అధ్వానంగా అంతర్గత రహదారులు

ABN , First Publish Date - 2020-12-14T04:36:08+05:30 IST

మండలంలోని పలు ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

అధ్వానంగా అంతర్గత రహదారులు
అధ్వానంగా తయారైన ఆర్‌అండ్‌బీ రహదారి

ఎర్రుపాలెం, డిసెంబరు 13: మండలంలోని పలు ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రేమిడిచర్ల-ఎర్రుపాలెం, జమలాపురం-ఎర్రుపాలెం, రేమిడిచర్ల-కొత్తపాలెం రహదారుల్లో గుంతలు పడి వర్షాకాలంలో చెరువులను తలపిస్తున్నాయి. అధ్వానంగా ఉన్న రహదారులకు మరమ్మతులు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. రాత్రుల సమయాల్లో ఈ రహదారుల్లో ఏర్పడిన గుంతలు కన్పించక పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో తమ ప్రయాణం నరకయాతనగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇంత అధ్వానంగా రహదారులు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.


Updated Date - 2020-12-14T04:36:08+05:30 IST