ఖమ్మం నగర రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్లు

ABN , First Publish Date - 2020-12-30T04:33:10+05:30 IST

ఖమ్మం నగర రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్లు

ఖమ్మం నగర రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్లు
రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు జీవో కాపీ అందిస్తున్న మంత్రి కేటీఆర్‌

నిధులు విడుదల చేసిన కేటీఆర్‌

ఖమ్మం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. నగరంలోని ఇంటర్నల్‌ రహదారుల అభివృద్ధికి రూ.30కోట్లను జీవో నెం.415ద్వారా విడుదల చేసింది. ఈ జీవో కాపీని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో మంగళవారం అందించారు. ఈనెల 7న  ఖమ్మం ఐటీ హబ్‌ ఆవిష్కరణకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు నగర అభివృద్ధికి నిధులు మంజూరుచేయాలని పువ్వాడ విజ్ఞప్తిచేశారు. సీఎం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ కింద రూ.30కోట్లు మంజూరు చేస్తున్నట్టు సభావేదికపై కేటీఆర్‌ ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఇందుకు 415జీవో ద్వారా రూ.30కోట్లు మంజూరుచేశారు. నగరంలో 11వ డివిజన్‌ నుంచి 48వ డివిజన్‌ వరకు సీసీ రహదారుల ఏర్పాటు, బీటీ రహదారుల ఆధునికీకరణకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు రవాణశాఖ మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-12-30T04:33:10+05:30 IST