రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-07T04:37:28+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందారు. ఈ సంఘటన గోదావరి వంతెనపై ఆదివారం రాత్రి జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఘటనా స్థలంలో మృతి చెందిన ప్రవీణ్‌, తీవ్రంగా గాయపడిన నరేష్‌

బూర్గంపాడు, డిసెంబరు 6: రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందారు. ఈ సంఘటన గోదావరి వంతెనపై ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం నుంచి సారపాక వైపునకు వెళ్తున్న కర్రలోడుతో వెళ్తున్న ట్రాక్టరును అదే మార్గంలో వెనుక నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనం డీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురిలో ఒకరు ఘటనా స్ధలంలో మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్‌ఐ బాలకృష్ణ సంఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు దుమ్ముగూడెం మండలం పెదనల్లబెల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌(24), నరేష్‌(23)గా గుర్తించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు.

Read more