జిల్లాలో 1,39,709 మంది రైతులకు ‘రైతుబంధు’

ABN , First Publish Date - 2020-12-28T04:19:35+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు నగదు 28 సోమవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు రైతు ఖాతాల్లో జమా కానున్నాయి.

జిల్లాలో 1,39,709 మంది రైతులకు ‘రైతుబంధు’

నేటి నుంచి  జనవరి 7వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ

కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబర్‌ 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు నగదు 28 సోమవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు రైతు ఖాతాల్లో జమా కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2020-2021 యాసంగి రైతు బందు 1,39,709 మందికి  రూ. 213.14 కోట్లు అందిచాల్సి ఉండగా.  సోమవారం ఒక్కరోజే 59,893 మంది రైతులకు రూ 34.21 కోట్లను జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు తెలిపారు. తొలుత తక్కువ ఎకరాలున్న రైతు నుంచి నగదు పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పంపిణీ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 7వ రకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-28T04:19:35+05:30 IST