పేదల కరెంటు బిల్లులు రద్దు చేయాలని వినతి

ABN , First Publish Date - 2020-06-18T10:26:19+05:30 IST

లాక్‌డౌన్‌ కాలంలో కరెంటు బిల్లులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ బుధవారం యువతెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని

పేదల కరెంటు బిల్లులు రద్దు చేయాలని వినతి

ఖమ్మం స్పోర్ట్స్‌, జూన్‌17: లాక్‌డౌన్‌ కాలంలో కరెంటు బిల్లులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ బుధవారం యువతెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో డీఈ రామారావుకు వినతి పత్రం అందించారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఇలాంటి సమయంలో వారిపై కరెంటు బిల్లుల భారం వేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ, నాయకులు జక్రయ్య, ఉజ్వల, వెంకటరమణాచారి, రంజాన్‌ ఉన్నారు.

Updated Date - 2020-06-18T10:26:19+05:30 IST