మూడు కిలొమీటర్ల పరిధిలో రెడ్‌జోన్‌

ABN , First Publish Date - 2020-04-07T10:06:50+05:30 IST

ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాలో కరోనా కేసు నమోదు కావడంతో బాధిత వ్యక్తి ఇంటి నుంచి మూడు

మూడు కిలొమీటర్ల పరిధిలో రెడ్‌జోన్‌

ఖమ్మం రూరల్‌, ఏప్రిల్‌ 6: ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాలో కరోనా కేసు నమోదు కావడంతో బాధిత వ్యక్తి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు ఎస్‌ఐ రాము తెలిపారు. పెద్దతండా చుట్టు రాకపోకలు నిలిపి వేశామన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.  కరోనా వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వచ్ఛందంగా వైద్యలను  వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


పెద్దతండాలో పారిశుధ్య పనులు

కరోనా కేసు నమోదు కావడంతో పెద్దతండా గ్రామంలో అధికారులు పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. వీధుల్లో బ్లీచింగ్‌ చల్లించారు. అతను ఉండే ఇంటిని మొత్తం క్రిమి నాశక ద్రావణాలతో శుభ్రం చేయించారు. ఆ వ్యక్తితో ఎవరెవరు తిరిగారో అనే విషయం పై గ్రామంలో ఏఎన్‌ఎంలు సర్వే నిర్వహిస్తున్నారు. వారందరినీ క్వారంటైన్‌కు తరలించనున్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, ఆర్డీవో రవీంద ర్‌, తహసీల్దార్‌ కారుమంచి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, పీహెచ్‌సీ డాక్టర్‌ శ్రీదేవి గ్రామాన్ని సందర్శించారు. 

Updated Date - 2020-04-07T10:06:50+05:30 IST