అభయాంజనేయస్వామి ఆలయంలో రాపత్తు సేవ
ABN , First Publish Date - 2020-12-28T04:34:37+05:30 IST
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ఆదివారం అభయాంజనేయస్వా మి దేవస్థానంలో రాపత్తు సేవ నిర్వహించారు.

భద్రాచలం, డిసెంబరు 27: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ఆదివారం అభయాంజనేయస్వా మి దేవస్థానంలో రాపత్తు సేవ నిర్వహించారు. తొలుత స్వామి వారిని ఆలయం నుంచి చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అలంకరించిన వేదికపై స్వామి వారిని ఆసీనులను చేశారు. ఈసమయంలో స్వామివారికి విష్వక్సేన పూజా, పుణ్యహవచనం, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, డా క్టర్ సుధర్శనరావు, డాక్టర్ జయభారతి, అభయాంజనేయస్వామి దేవస్థానం ఈవో వేణుగోపాల్ గు ప్తా, గట్టు వెంకటాచార్య పాల్గొన్నారు.