రామనామం ఎంతో గొప్పది

ABN , First Publish Date - 2020-12-12T04:53:30+05:30 IST

రామనామం ఎంతో గొప్పదని, మానవుడు విముక్తి చెందాలంటే రామనామం స్మరించాలని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానందభారతిస్వామి అన్నారు.

రామనామం ఎంతో గొప్పది
మాట్లాడుతున్న కమలానందభారతిస్వామి

 భువనేశ్వరీ పీఠాధిపతి కమలానందస్వామి

ముదిగొండ, డిసెంబరు 11: రామనామం ఎంతో గొప్పదని, మానవుడు విముక్తి చెందాలంటే రామనామం స్మరించాలని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానందభారతిస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని వల్లభిలో ఎండోమెంట్‌ నిధులు రూ.44లక్షలతో చేపట్టిన పురాతన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం హోమాలతో అర్చకులు పూజా కార్యక్రమాలు జరిపారు. ఉదయం 7.55గంటలకు కమలానందభారతిస్వామి ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. కమలానందభారతి స్వామి భక్తులకు హితోపదేశం చేశారు. గ్రామాల్లోని ప్రజలు ఇళ్లల్లో శుభకార్యాలు చేపట్టేటప్పుడు ముందుగా గ్రామదేవతలను పూజించుకోవాలని సూచించారు. రాముడి గొప్పతనమే రామనామం అని అలాంటి రామాలయాన్ని గ్రామంలో నిర్మించుకోవడం గ్రామస్థుల గొప్పతనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోట్ల కృష్ణకుమారి, రైతుబంధు మండల కన్వీనర్‌ పోట్ల వెంకటప్రసాద్‌, ఎంపీటీసీలు బిచ్చాల బిక్షం, రోజాని, చిమ్మసత్తి ఎల్లయ్య, మోహన్‌రావు,గ్రామస్థులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-12T04:53:30+05:30 IST