రామయ్య నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2020-11-27T05:40:48+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విశాఖపట్టణానికి చెందిన నున్నచిన్న పుల్లారావు రూ.1,01,116 విరాళంగా గురువారం అందజేశారు.

రామయ్య నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
విరాళాన్ని దేవస్థానం అధికారులకు అందజేస్తున్న దృశ్యం

భద్రాచలం, నవంబరు 26: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విశాఖపట్టణానికి చెందిన నున్నచిన్న పుల్లారావు రూ.1,01,116 విరాళంగా గురువారం అందజేశారు. తొలుత పుల్లారావు దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులైన సాహితి ప్రసన్న పేరు మీద నిత్యాన్నదాన పథకానికి విరాళాన్ని అందజేశారు. 

Read more