రైతు ఉద్యమం గొప్పది

ABN , First Publish Date - 2020-12-11T05:03:48+05:30 IST

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతువ్యతిరేక చట్టాలకు నిరసనగా ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమాలు చారిత్రాత్మకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

రైతు ఉద్యమం గొప్పది
మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ముదిగొండ, డిసెంబరు 10: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతువ్యతిరేక చట్టాలకు నిరసనగా ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమాలు చారిత్రాత్మకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ముదిగొండలోని మచ్చావీరయ్య భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతుల పక్షాన సీపీఎం వెన్నుదన్నుగా పనిచేస్తుందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎ్‌సతో ప్రజలను ఆర్థికంగా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అసైన్‌మెంట్‌ పట్టాలను రద్దుచేసి పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటుందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్‌, బండి, పద్మ, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, నాయకులు బట్టు పురుషోత్తం, మర్లపాటి వెంకటేశ్వర్లు, మందరపు వెంకన్న, బట్టు రాజు, పద్మ, టీఎ్‌స.కల్యాణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-11T05:03:48+05:30 IST