సాగు సాయం షురూ: రైతుల ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు

ABN , First Publish Date - 2020-12-29T05:28:21+05:30 IST

సాగు సాయం షురూ: రైతుల ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు

సాగు సాయం షురూ:  రైతుల ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు

ఖమ్మం వ్యవసాయం/కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబరు 28: ఖమ్మం ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటలకు రైతు బంధు సాయం అందుతోంది. సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతోంది.  

ఖమ్మం జిల్లాలో  రూ.355.17 కోట్లు

 మొత్తం రూ.355.17 కోట్లు రైతులకు చేరుతోంది. ఈమేరకు  సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయింది.  పట్టాపుస్తకాల వివరాలు, బ్యాంకు ఖాతాలను ఆన్‌లైన్‌ చేసిన మేరకు రైతుబంఽధు సాయం డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమఅవుతున్నాయని జిల్లా వ్యవసాయాధికారి సరిత వివరించారు. జిల్లాలో మొత్తం యాసంగి సాగు చేసే రైతులు 3,04,512 ఉండగా 2,95,402 మంది బ్యాంకు ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌ చేసినట్లు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లాలోని అర్హులైన అందరి రైతులకు రైతుబంధు సాయం అందుతుందన్నారు. 

భద్రాద్రి జిల్లాలో... 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సొమవారం నుంచి వేసంగి రైతులకు రైతబుంధు నిధులు చెల్లింపు ప్రారంభమైందని, జిల్లాలో మొత్తం 1,39,704మంది రైతులకు ఈ నిధులు వారి ఖాతాల్లో జమ అవుతాయని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ నందు వ్యవసాయ, బ్యాంకు అధికారులతో రైతుబంధు నిధులు చెల్లింపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1,2 ఎకరాలున్న రైతులకు 28వ తేదీన, 3,4 ఎకరాలున్న రైతులకు ఈనెల 31న, 5,6 ఎకరాలున్న రైతులకు జనవరి 4వ తేదీన, 7 ఎకరాలపై బడిన రైతులకు జనవరి 7వ తేదీన రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. తొలి విడతగా 84వేల మంది రైతులకు రూ.63కోట్లు జమ చేశామన్నారు. 



Updated Date - 2020-12-29T05:28:21+05:30 IST