సత్తుపల్లి.. నాకు పునర్జన్మ ఇచ్చింది..ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ABN , First Publish Date - 2020-12-20T04:19:50+05:30 IST
రాజకీయంగా సత్తుపల్లి నియోజకవర్గం తనకు పునఃర్జన్మను ఇచ్చిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

జలగం కుటుంబం.. తుమ్మల అభివృద్ధి ప్రధాతలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సత్తుపల్లి, డిసెంబరు 19 : రాజకీయంగా సత్తుపల్లి నియోజకవర్గం తనకు పునఃర్జన్మను ఇచ్చిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రూ.1.34కోట్ల విలువైన మండలంలోని బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి, రేజర్ల, సదాశివునిపాలెం గ్రామాల్లో సింగరేణి నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంఖుస్థాపనలు, ఈజీఎస్ నిధులతో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపిండ్ షెడ్లను శనివారం ఆయన ప్రారంభించారు. బుగ్గపాడులో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం పొంది నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఈ ప్రాంత అభివృద్ధి తనవంతు పాత్ర ఉంటుందని హామీ ఇచ్చారు. దివంగత జలగం వెంగళరావు, మాజీమంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావ్ ప్రాతినిద్యం వహించిన సత్తుపల్లికి రాష్ట్రస్థాయిలో ఒక సుస్థిరమైన స్థానం ఉందన్నారు. జిల్లాలో ఆదర్శంగా వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలను నిర్మించుకున్నామన్నారు. చంద్రాయపాలెం గ్రామానికి ఐటీడీఏ ద్వారా రూ.20లక్షల కేటాయించామని, సీతారామ ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం ఇప్పిస్తానని చెప్పారు. బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో స్థానికులకు ఉద్యోగవకాశాలతో గ్రామాభివృద్ధికి ప్రారంభోత్సవానికి వచ్చే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడతానని అన్నారు. నాయకులుగా ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామన్నారు.సింగరేణి సంస్థ సహకారంతో పలు అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. కొద్దిరోజుల్లో రాష్ట్రమంత్రుల పర్యటనలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించుకోబోతున్నామని, టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయి నుంచి ప్రతిఒక్కరం కృషి జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య డీడీ, స్పెషలాఫీసర్ ధనరాజ్, ఇన్‌చార్జీ తహసీల్దార్ సంపత్, ఈజీఎస్ ఏపీడీ శ్రీనివాసరావు, ఏపీవో ఎం.బాబు, ఏపీఎం కేవీ.సుబ్బారావు, ఎంపీవో కృష్ణ, పీఆర్ ఏఈ వెంకటేశ్వరరావు, గిర్దావర్ జగదీష్, రైతుబంధు మండల కన్వీనర్ గాదె సత్యం, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, సొసైటీ చైర్మన్లు తుమ్మూరి శ్రీరామప్రసాద్, చిలుకుర్తి కృష్ణమూర్తి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మామిళ్లపల్లి కృష్ణయ్య, ఆత్మ డైరెక్టర్ వినుకొండ వెంకటరామయ్య, పంచాయితీ సెక్రటరీలు చీకటి చైతన్య, మద్దేటి రవి, చెన్నారావు, టీఆర్‌ఎస్ నాయకులు కాల్నేని వెంకటేశ్వరరావు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, కొడిమెల అప్పారావు, బొడ్డు శివ, వల్లభనేని పవన్, దాసరి శ్రీదర్‌రెడ్డి, గుర్రాల సురేష్, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచ్‌లు మందపాటి ముత్తారెడ్డి, కంచర్ల రమాదేవి నాగేశ్వరరావు, తుమ్మూరు సరస్వతీ దామోదర్‌రెడ్డి, పానెం రేణుక ఈశ్వర్, జక్కుల ప్రభాకరరావు, ఉప సర్పంచ్‌లు ఏగోటి పెద్దిరాజు, ధనుంజయరావు, భీమిరెడ్డి అరుణ, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.