రవాణశాఖలో ఏఎంవీలకు ఎంవీఐలుగా ఉద్యోగోన్నతి
ABN , First Publish Date - 2020-12-07T04:55:40+05:30 IST
రవాణశాఖలో ఏఎంవీఐలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎంవీఐలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు శనివారం రాత్రి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి.

ఖమ్మం ఎంవీఐగా వరప్రసాద్
ఖమ్మం కమాన్‌బజార్, డిసెంబరు 6: రవాణశాఖలో ఏఎంవీఐలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎంవీఐలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు శనివారం రాత్రి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వంశీధర్ ఉద్యోగోన్నతిపై జగిత్యాలకు, కిషోర్‌బాబు అశ్వారావుపేట చెక్‌పోస్టుకు, విజయలక్ష్మీ కల్లూరు చెక్‌పోస్టుకు బదిలీ అయ్యారు.కల్లూరు చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న మసూద్‌ఆలి కరీంనగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి బదిలీ అయ్యారు. అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న వెంకటపుల్లయ్య కల్లూరు చెక్‌పోస్టుకు బదిలీ అయ్యారు. ఆదిలాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న వరప్రసాద్ బదిలీపై ఖమ్మం వచ్చారు. గతంలో వరప్రసాద్ ఇక్కడ ఏఎంవీఐగా విఽధులు నిర్వర్తించారు. సోమవారం నుంచి ఆయన విధుల్లో చేరనున్నట్టు తెలిపారు.