ప్రైవేట్‌ ఉద్యోగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-02T04:57:09+05:30 IST

పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తాళ్లపెంటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

ప్రైవేట్‌ ఉద్యోగి ఆత్మహత్య

పెనుబల్లిరూరల్‌, డిసెంబరు 1: పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తాళ్లపెంటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గువ్వల కృష్ణారెడ్డి (40) ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కంపనీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-12-02T04:57:09+05:30 IST