అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2020-12-14T04:31:06+05:30 IST
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాం

కేంద్రం దృష్టికి ఆ ఐదు పంచాయతీల విషయం
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
భద్రాచలం, డిసెంబరు 13: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపెడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. భద్రాచలంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి అభివృద్దికి రూ.100 కోట్లు కేటాయించామన్న సీఎం కేసీఆర్ ఆ విషయాన్నే విస్మరించారన్నారు. ఈ క్రమంలో భద్రాచలం ఆలయ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినా, కేంద్రం ద్వారా అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు. ఇందు కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడతానని అన్నారు. ఆ ఐదు పంచాయతీల విషయం మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగుతోందని ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆంధ్ర వలస పాలకులే నయమనే పరిస్థితి పాలకులు తెచ్చారని ఆరోపించారు. ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిం దా అని తెలంగాణవాదులే మదనపడుతున్నారని అన్నారు. రైతు మేలు కోసమే వ్యవసాయ చట్టాలు కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన కవితను ఏం తొందరచ్చిందని సంవత్సరం తిరగక ముందే ఎమ్మెల్సీని చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యమకారులు లేరా అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజాసత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంరాజు బెహర, మండల అధ్యక్షుడు ఎం.రామ్మోహన్‌రావు, నిడదవోలు నాగబాబు, ఏనుగుల వెంకటరెడ్డి పాల్గొన్నారు.