వైరా పీహెచ్‌సీకి పీపీఈ కిట్లు

ABN , First Publish Date - 2020-07-05T10:30:45+05:30 IST

లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష విలువైన కరోనా నివారణకు చెందిన పీపీఈ కి ట్లను వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా పీహెచ్‌సీకి పీపీఈ కిట్లు

లయన్స్‌క్లబ్‌ను అభినందించిన ఎమ్మెల్యే


వైరా, జూలై 4: లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష విలువైన కరోనా నివారణకు చెందిన పీపీఈ కి ట్లను వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం ఎమ్మెల్యే రాములునాయక్‌ చేతులమీదుగా అందజేశారు. వైరా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్యులకు, సంబంధిత సిబ్బంది కోసం ఎన్‌ 95మా్‌స్కలు, శానిటైజర్లు, ఇతర పరికరాలను ఎమ్మెల్యే ద్వారా అందించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ జైపాల్‌, సీతరాములు, ఎంపీపీ పావని, జడ్పీటీసీ కనకదుర్గ, లయన్స్‌క్లబ్‌ నిర్వాహాకులు డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్‌, డాక్టర్‌ శ్రీధర్‌, ఎన్‌.నాగేశ్వరరావు, డాక్టర్‌ పెరుమాళ్ల కృష్ణమూర్తి, శ్యాంబాబు, డాక్టర్‌ సుచరిత, నూకల ప్రసాద్‌, షేక్‌.పాషా, నూకల వాసు, సునీత, నీరజ, ధార్న రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T10:30:45+05:30 IST