పోలీసుల అదుపులో నక్సల్స్‌ కొరియర్లు.. ?

ABN , First Publish Date - 2020-07-19T06:16:51+05:30 IST

మావోయిస్టు కొరియర్లుగా అనుమానిస్తున్న ఇద్దరిని సత్తుపల్లి పోలీసులు అదుపులోకి ..

పోలీసుల అదుపులో నక్సల్స్‌ కొరియర్లు.. ?

సత్తుపల్లి రూరల్‌, జూలై 18: మావోయిస్టు కొరియర్లుగా అనుమానిస్తున్న ఇద్దరిని సత్తుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అనధికారిక సమాచారం మేరకు సత్తుపల్లిలోని ప్రముఖ సింగరేణి కాంట్రాక్టు సంస్థ నుంచి చందాలు వసూలు చేసేందుకు వచ్చిన ఇద్దరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు మావోయిస్టు కొరియర్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజంగా మావోయిస్టు కొరియర్లా లేక నకిలీలా అనే విషయం తేలాల్సి ఉంది. దీనిపై స్థానిక పోలీసులు మాత్రం స్పందించటం లేదు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ఽధృవీకరించాల్సి ఉంది.

Updated Date - 2020-07-19T06:16:51+05:30 IST