ఫైనాన్స్‌ వ్యాపారులపై పోలీసుల ఆరా

ABN , First Publish Date - 2020-07-28T10:08:30+05:30 IST

చర్ల మండలంలో నడుస్తున్న ఫైనాన్స్‌ దందాపై పోలీసులు దృష్టిసారించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి‘ దిన పత్రికలో ‘జోరుగా ఫైనాన్స్‌ దందా’ అనే

ఫైనాన్స్‌ వ్యాపారులపై పోలీసుల ఆరా

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


చర్ల, జులై 27: చర్ల మండలంలో నడుస్తున్న ఫైనాన్స్‌ దందాపై పోలీసులు దృష్టిసారించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి‘ దిన పత్రికలో ‘జోరుగా ఫైనాన్స్‌ దందా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి సీఐ సత్యనారాయణ స్పందించారు. మండలంలో నడుస్తున్న వ్యాపారాలపై ఆరా తీశారు. మండలంలో ఎంత మంది వ్యాపారులు ఉన్నారు.. ఎన్ని రోజులు వ్యాపారాలు నడుస్తాయి అని విరాలు సేకరించారు. ఫైనాన్స్‌ ఇచ్చి నగదు వసూలు చేసే క్రమంలో బెదించే వారి విరాలుకూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది, కాగా ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఫైనాన్స్‌ వ్యాపారులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. మా వ్యాపాలకు గురించి మీకెందుకు అనే ధోరణిలో ఆరోపణలు చేస్తున్నారు.  కాగా ఫైనాన్స్‌ వ్యాపారుల చేతిలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చర్ల పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేస్తామని చెబుతున్నారు.

Updated Date - 2020-07-28T10:08:30+05:30 IST