జర్నలిస్టుపై పోలీసుల దాడి అమానుషం
ABN , First Publish Date - 2020-03-25T11:29:19+05:30 IST
హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి పొలిటికల్ బ్యూరోచీఫ్ శ్రీనివా్‌సపై పోలీసులు దాడి చేయడం అమానుషమని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఇల్లెందుటౌన్, మార్చి 24: హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి పొలిటికల్ బ్యూరోచీఫ్ శ్రీనివా్‌సపై పోలీసులు దాడి చేయడం అమానుషమని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఇల్లెందులో ఐజేయూ జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, గుడివాడ శ్రీనివాస్, సుమంత్, నర్సి, వీరమోహన్ మాట్లాడుతూ పోలీసుల చర్యలను తీవ్రంగా పరిగణించాలని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భాద్యులైన పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.