మావోయిస్టు కొరియర్‌, మాజీ దళ సభ్యుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-11T04:40:04+05:30 IST

మా వోయిస్టు కొరియర్‌, మాజీ దళస భ్యుడు పొడియం జయరామ్‌ అలి యాస్‌ గురూజీ, అలియాస్‌ ఇడమ య్యను చర్ల పోలీసులు అరెస్టు చేశారు.

మావోయిస్టు కొరియర్‌, మాజీ దళ సభ్యుడి అరెస్టు
అరెస్టును వివరిస్తున్న పోలీసులు

భద్రాచలం, డిసెంబరు 10: మా వోయిస్టు కొరియర్‌, మాజీ దళస భ్యుడు పొడియం జయరామ్‌ అలి యాస్‌ గురూజీ, అలియాస్‌ ఇడమ య్యను చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలంలోని తన కార్యాలయంలో ఏఎ్‌సపీ డాక్టర్‌ వినీత్‌ వెల్లడించారు. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోని చింత గుప్ప, బోదెనెల్లి అటవీ ప్రాంతంలో బుధవారం కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించగా వారిలో ఒకరిని పట్టుకుని విచారించారు. సదరు వ్యక్తి చర్ల మండలం కొండివాయి గ్రామంకు చెందిన పొడియం జయరాం అలియాస్‌ గురూజీ, అలియాస్‌ ఇడమయ్యగా తెలిసినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి పది జిలిటెన్‌ స్టిక్స్‌, రెండు డిటోనేటర్లు, రెండు ఎలక్ట్రికల్‌ వైర్లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామని ఏఎ్‌సపీ వివరించారు. జయరామ్‌ 2006 నుంచి 2015 వరకు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ ప్రాంతాల్లో పని చేశాడని తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌లోని పలు స్టేషన్‌లలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉండగా ఉపా చట్టం కింద సైతం కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం డిసెంబరు రెండు నుంచి మావోయిస్టుల వారోత్సవాలు నిర్వహిస్తుండ టంతో తెలంగాణ సరిహద్దుల్లో విఽధ్వంసానికి తెరలేపారని అన్నారు. ఈ క్రమంలో జయరామ్‌ చర్ల పోలీసులకు పట్టుబడ్డాడని పేర్కొన్నారు. మిగిలిన మిలీషియా సభ్యులు పారిపోయారని ఆయన వివరించారు. 


Updated Date - 2020-12-11T04:40:04+05:30 IST