పోడు భుములకు పట్టాలిచ్చే వరకు ఆందోళన

ABN , First Publish Date - 2020-12-29T05:08:33+05:30 IST

ఏళ్ల తరబడి పోడు చేసుకుని జీవనం గడుతున్న ఆదివాసీలకు పట్టాలిస్తామని ఎన్నికల సమయంలో హమీ ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు మార్చుతున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు.

పోడు భుములకు పట్టాలిచ్చే వరకు ఆందోళన
సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం 

గుండాలలో ‘పోడు భుములకు హక్కులు’ పై సదస్సు

భారీగా తరలివచ్చిన గిరిజన రైతులు 

గుండాల, డిసెంబరు 28: ఏళ్ల తరబడి పోడు చేసుకుని జీవనం గడుతున్న ఆదివాసీలకు పట్టాలిస్తామని ఎన్నికల సమయంలో హమీ ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు మార్చుతున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. పోడు హక్కు పత్రాలు వచ్చేం వరకు దశల వారి ఉద్యమానికి రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా గుండాలలో ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన  ‘పోడు భుములకు హక్కులు’ అనే అంశంపై సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెలంగాణ రాక ముందు రైతు సంక్షేమ తమ లక్ష్యమని చెప్పిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలను, ఉద్యమకారులను, రైతులను విస్మరించి ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజ మెత్తారు. గతీ అసెంబ్లీ ఎన్నిలకు ముందుగా ఇల్లెందు, కొత్తగూడెం, సభల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ నేడు రైతుల భూములను హారితహారం పేరుతో బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రణ సాగు పేరుతో గడిచిన సీజన్‌లో రైతులను నిండా ముంచిన కేసీఆర్‌ ప్రస్తుతం రైతులు తమ ఇష్టం వచ్చిన పంటలను వేసుకోవచ్చని చెప్పడం, రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తడం రైతులను మోసం చేయడమేనన్నారు. సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మట్టాడుతూ రాష్ట్రంలో నియంతపాలన సాగుతుందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ముఖ్యమంత్రి ఫాంహౌ్‌సలో పడుకుని రాష్ట్రాన్ని దీవాల తీయిసున్నారని ధ్వజమెత్తారు.పీఐ ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన కుంటుపడింవదన్నారు. వర్షాలకు వేల ఎకరాల పంటలను కోల్పోయిన రైతులకు నష్ట పరిహరం ప్రకటించకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్‌లో వరద బాధితులకు పరిహరం చెల్లించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్డీ రాష్ట్ర నాయకుడు సాధినేని వెంకటేశ్వరావు మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా ప్రాంతంలో రైతులు అడవులను పోడు సాగు చేసుకుంటున్నారంటే అన్నలు వారికి అండగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షడు రమణాల లక్ష్మయ్య, ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్‌ కోసం సీతారాములు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:08:33+05:30 IST