ప్లాస్టిక్‌ రహిత భద్రాద్రికి సహకరిస్తాం

ABN , First Publish Date - 2020-12-26T04:17:32+05:30 IST

ప్లాస్టిక్‌ రహిత భద్రాద్రికి తప్పకుండా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత భద్రాద్రికి సహకరిస్తాం
జ్యూట్‌ బ్యాగులను ఆవిష్కరిస్తున్న మంత్రి, అధికారులు

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌

భద్రాచలం, డిసెంబరు 25: ప్లాస్టిక్‌ రహిత భద్రాద్రికి తప్పకుండా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. భద్రాచలంలో జేడీ ఫౌండేషన్‌ బాధ్యులు మురళీమోహన్‌ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతీ యువకులకు జ్యూట్‌ బ్యాగుల తయారీ నందు శిక్షణ, ఇతర ప్లాస్టిక్‌ రహిత ఉత్పత్తుల తయారీ మీద శిక్షణ ఇప్పించి ట్రైకార్‌ రుణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T04:17:32+05:30 IST