మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2020-11-19T06:33:56+05:30 IST

మండల పరిధిలోని పట్వారిగూడెం రైతు వేదిక ప్రాంగణంలో బుధవారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు

మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత

దమ్మపేట, నవంబరు 18: మండల పరిధిలోని పట్వారిగూడెం రైతు వేదిక ప్రాంగణంలో బుధవారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెట్లు పెంచడం వల్ల ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ స్వామి, ఎంపీడీవో రవి, ఎంపీవో ఒత్తిన శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మం డల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ మల్లిఖార్జునరావు, పట్వారిగూడెం సర్పంచ్‌ అంజలి, వైస్‌ సర్పంచ్‌ నాగయ్య, నాగేశ్వరరావు, భరత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T06:33:56+05:30 IST