పెండింగ్‌ పనులు పూర్తిచేయిస్తా

ABN , First Publish Date - 2020-06-25T10:18:13+05:30 IST

పాలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయిస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

పెండింగ్‌ పనులు పూర్తిచేయిస్తా

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


ఖమ్మం రూరల్‌, జూన్‌ 24 : పాలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయిస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం రూరల్‌ మండలానికి వచ్చిన ఆయన నాయుడుపేట సమీపంలోని ఓ ఫంక్షన్‌హాలులో ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యల గురించి తన దృష్టికి తీసుకువస్తే వాటిని సరిస్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీఒక్కరికి అందేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సాధు రమేష్‌రెడ్డి, ఆత్మాకమిటీ మాజీ చైర్మన్‌ మద్ది మల్లారెడ్డి, నాయకులు తేజావత్‌ పంతులు నాయక్‌, తోట వీరభద్రం, కిృష్ణ, రామయ్య, కొప్పుల చంద్రశేఖర్‌, సుబ్బారావు, ఉపేందర్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T10:18:13+05:30 IST