సింగరేణీయులకు రేపు లాభాల వాటా చెల్లింపు

ABN , First Publish Date - 2020-10-22T07:12:34+05:30 IST

సింగరేణీయులకు యాజమాన్యం ఏటా చెల్లించే లాభాల వాటాను ఈ నెల 23వ తేదీన బ్యాంక్‌ పేమెంట్‌ ద్వారా చెల్లించనున్నట్టు జీఎం (పర్సనల్‌) ఎ. ఆనందరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు

సింగరేణీయులకు రేపు లాభాల వాటా చెల్లింపు

జీఎం (పర్సనల్‌) ఏ. ఆనందరావు వెల్లడి


కొత్తగూడెం, అక్టోబరు 21: సింగరేణీయులకు యాజమాన్యం ఏటా చెల్లించే లాభాల వాటాను ఈ నెల 23వ తేదీన బ్యాంక్‌ పేమెంట్‌ ద్వారా చెల్లించనున్నట్టు జీఎం (పర్సనల్‌) ఎ. ఆనందరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సారి సాధించిన మొత్తం లాభం రూ.993కోట్లలో ప్రస్తుతం రూ.278కోట్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా హాజరు శాతం పై 82 శాతం, వ్యక్తిగత పర్‌ఫార్మెన్స్‌ 4శాతం, గ్రూప్‌ పర్‌ఫార్మెన్స్‌పై 14 శాతం మొత్తంగా 100శాతం ఇస్తున్నామ తెలిపారు. ఇందులో అండ ర్‌ గ్రౌండ్‌లో పనిచేసే వారికి ఒక మస్టర్‌కు సరాసరి రూ.277.70పైసలు పైగా సర్ఫేస్‌లో అనగా ఎస్‌టీపీపీ, ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ సీఎస్‌పీ, వర్క్‌షాపు మొదలైన చోట్లలో పని చేసే వారికి మస్టర్‌కు రూ.180.26పైసలు వివిధ ఆఫీస్‌లు, డిపార్ట్‌మెంట్లలో పనిచేసే వారికి మస్టర్‌కు రూ.166.39పైసల చొప్పున ఈ లాభాల వాటాలో కలుతామన్నారు. మొత్తంగా సింగరేణీయులకు యాజమాన్యం చెల్లించే ఈ లాభాల వాటాను కుటుంబ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కానీ, ఇంటికి సంబంధించిన గృహోపకరణలు కానీ తీసుకొని లాభాల వాటాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-10-22T07:12:34+05:30 IST