పట్టాల ఇంటిలోనే జీవనం..కనీస సౌకర్యాలు లేని దళిత కుటుంబం

ABN , First Publish Date - 2020-12-12T04:55:31+05:30 IST

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. కటిక పేదరికం, భార్యకు అందత్వం కుంగదీస్తున్నా మొక్కవోని దైర్యంతో కూలికి వెళ్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.

పట్టాల ఇంటిలోనే జీవనం..కనీస సౌకర్యాలు లేని దళిత కుటుంబం
పట్టాలతో ఏర్పాటు చేసుకున్న గుడారం

 సీపీఎం సాయంతో తాత్కాలిక గూడుకు శంకుస్థాపన

బోనకల్‌, డిసెంబరు 11: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. కటిక పేదరికం, భార్యకు అందత్వం కుంగదీస్తున్నా మొక్కవోని దైర్యంతో కూలికి వెళ్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. కొద్దిపాటి సొంత స్థలం ఉండటంతో అందులో పట్టాలు చుట్టూ కట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పరిస్థితి బోనకల్‌ మండలంలో గోవిందాపురం(ఎల్‌) గ్రామంలో పలువురిని కలిచి వేస్తుంది. గ్రామానికి చెందిన బండారుపల్లి గోపయ్య దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఇన్‌ఫెక్షన్‌తో భార్య రెండు కళ్లు దెబ్బతిన్నాయి. వారి కుటంబ పరిస్థితిని చూసిన సీపీఎం గ్రామ కమిటీ రెకుల గదిని కట్టించేందుకు ముందుకొచ్చారు. సొసైటీ చైర్మన్‌ మాదినేని వీరభద్రం, ఉప సర్పంచ్‌ కారంగుల చంద్రయ్య, సీపీఎం సీనియర్‌ నాయకులు కళ్యాణపు బుచ్చయ్య, ఉమ్మినేని రవి, ఎంపీటీసీ జొన్నలగడ్డ సునిత, ఏడునూతల లక్ష్మణ్‌రావు, కొమ్ము శ్రీనివాసరావు, కోట కాట య్య, ఏసుపోగు బాబు, కళ్యాణపు శ్రీనివాసరావు, వల్లంకొండ సురే్‌ష ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  


Updated Date - 2020-12-12T04:55:31+05:30 IST