పామాయిల్‌ రూ.11,737

ABN , First Publish Date - 2020-11-07T09:50:16+05:30 IST

పామాయిల్‌ గెలల ధర ఈనెల టన్నుకు రూ.172లు పెరిగింది. గత నెల టన్ను ఒక్కంటికి ధర రూ.11,565లు ఉండగా, నవంబరు నెలకు రూ.172లు అదనంగా పెరిగింది

పామాయిల్‌  రూ.11,737

అశ్వారావుపేట, నవంబర్‌ 6: పామాయిల్‌ గెలల ధర ఈనెల టన్నుకు రూ.172లు పెరిగింది. గత నెల టన్ను ఒక్కంటికి ధర రూ.11,565లు ఉండగా, నవంబరు నెలకు రూ.172లు అదనంగా పెరిగింది. అంటే ఈనెల టన్ను ధర రూ.11,737కి చేరింది. పెరిగిన ధర నవంబరులో ఫ్యాక్టరీకి తరలించిన గెలలకు చెల్లించామని ఆయిల్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ టి. సుధాకరరెడ్డి తెలిపారు. రైతులు పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే ఫ్యాక్టరీ తీసుకొని రావాలని సూచించారు. నాణ్యమైన గెలలను తెచ్చి సహకరించాలని ఆయన రైతులను కోరారు. 


Updated Date - 2020-11-07T09:50:16+05:30 IST