జిల్లాలో 748పల్లెప్రకృతివనాలు పూర్తి

ABN , First Publish Date - 2020-12-02T04:55:03+05:30 IST

జిల్లాలో 584గ్రామపంచాయతీల పరిధిలో 748 పల్లెప్రకృతివనాలు పూర్తయ్యాయని డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ డి.శిరీష వెల్లడించారు.

జిల్లాలో 748పల్లెప్రకృతివనాలు పూర్తి

డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ శిరీష 

వేంసూరు, డిసెంబరు 1: జిల్లాలో 584గ్రామపంచాయతీల పరిధిలో 748 పల్లెప్రకృతివనాలు పూర్తయ్యాయని డీఆర్‌డీవో అడిషనల్‌ పీడీ డి.శిరీష వెల్లడించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 316 వైకుంఠధామాలు, 525కంపోస్టు షెడ్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. జిల్లాకు 4203 కల్లాలు మంజూ రు కాగా ఇప్పటివరకు 1493పనులు ప్రారంభం కాగా వీటిలో 41పూర్తయ్యాయని పేర్కొన్నారు. పంచాయతీల్లో మిగిలిపోయిన అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. గ్రామపంచాయతీల్లో పల్లెప్రకృతి వనాలను మరింత ఆహ్లాదకరంగా నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందించటం అభినందనీయంగా పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీవో వీరేశం పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T04:55:03+05:30 IST