ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2020-05-29T10:04:57+05:30 IST
కల్లూరులో మండల టీడీపీ ఆధ్వర్యంలో మాజీముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి

కల్లూరు/వేంసూరు/తల్లాడ/పెనుబల్లి, మే 28: కల్లూరులో మండల టీడీపీ ఆధ్వర్యంలో మాజీముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. స్థానిక మెయిన్‌రోడ్డులో తెలుగుదేశం పార్టీ స్థూపం వద్ద ఆపార్టీ నాయకుడు కాకర్ల రంగారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. అలాగే చెన్నూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పోట్రు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు వలసాల వెంకట్రామయ్య, డి.ఏడుకొండలు, రావూరి వెంకటేశ్వరరావు, మాదల రామారావు పాల్గొన్నారు.
వేంసూరు మండలంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. చెంబూనిగూడెం, లింగపాలెం గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొంతు భాస్కర్‌రావు, మండల మహిళా అధ్యక్షురాలు బొంతు విజయలక్ష్మీ, మధుసూదన్‌రావు, రామకృష్ణ, శోభన్, నల్లమోతు ప్రసాద్, బొంతు రామారావు, నాయుడు వంశీ పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని గురువారం తల్లాడలో నిర్వహించారు. పార్టీ పతాకాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు కూచిపూడి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మూకర ప్రసాద్, టీడీపీ నాయకులు మొక్కా కృష్ణార్జున్‌రావు, సరికొండ శ్రీనివాసరాజు, ఎండీ.బాబు, దుగ్గినేని వెంకటేశ్వర్లు, రావూరి రవిప్రసాద్ పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలను మండల టీడీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రింగ్సెంటర్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యలమర్తి నాగాంజనేయరావు, నాయకులు మోరంపూడి చంద్రశేఖర్, ఎస్పీ బాబు, బాబూరావు, చంద్రశేఖర్, వేణు, కృష్ణ, రాజేశ్వరరావు, బాబూరావు పాల్గొన్నారు.