ఖమ్మంలో కరోనా లేదు

ABN , First Publish Date - 2020-04-01T11:04:02+05:30 IST

: ‘ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలో లేదు. ఇప్పటి వరకు వ్యాధి నిర్ధరణకు గాంధీ ఆసుపత్రికి పంపిన 100 నమూనాలు కూడా నెగిటివ్‌ వచ్చాయని ’ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి తెలిపారు.

ఖమ్మంలో కరోనా లేదు

 ఇప్పటి వరకు 100 నమూనాల సేకరణ

ఆ 17మంది హైదరాబాదీలే .. డీఎంహెచ్‌వో మాలతి


ఖమ్మంసంక్షేమవిభాగం, మార్చి 31: ‘ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలో లేదు. ఇప్పటి వరకు వ్యాధి నిర్ధరణకు గాంధీ ఆసుపత్రికి పంపిన 100 నమూనాలు కూడా నెగిటివ్‌ వచ్చాయని ’ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి తెలిపారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన వారిలో కేవలం పది మంది మాత్రమే ఖమ్మం జిల్లా వారని, మిగిలిన 17మంది హైదరాబాదీలే అని ఆమె తెలిపారు. సోమవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


27మంది ఖమ్మం జిల్లా వాసులు ఉన్నారని సమాచారం అందిందని అయితే ఆర్‌ఆర్‌టీ బృందం పరిశీలన చేయగా 17మంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని తెలిసిందన్నారు. వారిలో కొంతమంది ఇప్పటికే గాంధీఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్నారని వివరించారు. కలెక్టర్‌ కర్ణన్‌ సూచనలతో జిల్లాలో ఎప్పటికప్పుడు కరోనా నివారణ చర్యలు తీసుకోవటంతో కేసులు నమోదు కావడం లేదన్నారు. భవిష్యత్‌లో ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పాడిన అందుకు సిద్ధంగా వెయ్యికి పైగా పడకలు సిద్ధం చేశామన్నారు. కరోనాపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పూర్తి స్థాయిలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. విలేకరుల సమావేశంలో కోవిడ్‌ -19 జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ కోటిరత్నం, వైద్యులు మాధవరావు, డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-04-01T11:04:02+05:30 IST