నూతన రెవెన్యూ చట్టం... రైతులకు బ్రహ్మాస్త్రం

ABN , First Publish Date - 2020-09-14T10:18:25+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం రైతుల చేతిలో బ్రహ్మాస్త్రమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.

నూతన రెవెన్యూ చట్టం... రైతులకు బ్రహ్మాస్త్రం

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సీఎంకు కృతజ్ఞతగా తల్లాడలో ఎడ్లబండ్ల ర్యాలీ


తల్లాడ, సెప్టెంబరు 13: సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం రైతుల చేతిలో బ్రహ్మాస్త్రమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతన రెవెన్యూచట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతగా, ఆ చట్టానికి సంఘీభావంగా ఆదివారం తల్లాడలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. నారాయణపురం లూర్దుమాత ఉన్నత పాఠశాల వద్ద ఈ ర్యాలీని డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. సంప్రదాయపద్ధతిలో నిర్వహించిన ఈ ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్థానిక రింగ్‌రోడ్డు సెంటర్లో కేసీఆర్‌ ఫ్లెక్సీకి నాయకులు పాలు, పూలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ 130ఏళ్ల తర్వాత తీసుకువస్తున్న నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని,  భూసమస్యలు, పాస్‌పుస్తకాల కోసం నెలలతరబడి రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే బాధితులకు ఎంతో ఊరట లభిస్తుందన్నారు. లంచావతారులుగా మారిన కొందరు రెవెన్యూ ఉద్యోగుల బారి నుంచి రైతులను కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలు నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు.


అనంతరం డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌.. రైతు బాంధవుడని, వ్యవసాయరంగ అభివృద్ధికి ఆయన ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ భద్రరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరమోహన్‌రెడ్డి, వెంకట్‌లాల్‌, సొసైటీ చైర్మన్‌ ఎ.ప్రదీప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాము, సర్పంచ్‌లు కోటారెడ్డి, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, సీతారామిరెడ్డి, శ్రీనివాసరావు, కృష్ణయ్య, టి.కృష్ణయ్య, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు ఆదూరి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు కోటిరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ వ్యవస్థను కొనసాగిస్తూ, వారి వారసులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించేలా నూతన రెవెన్యూ చట్టంలో పొందుపర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను వీఆర్‌ఏలు ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2020-09-14T10:18:25+05:30 IST