నవమి ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2020-02-17T10:57:41+05:30 IST

శ్రీరామనవమికి ఇంకా 40 రోజుల వ్యవధి ఉన్నందున, ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రణాళికాబద్దంగా ఎటువంటి

నవమి ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి

అధికారులతో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి


భద్రాచలం, ఫిబ్రవరి 16: శ్రీరామనవమికి ఇంకా 40 రోజుల వ్యవధి ఉన్నందున, ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రణాళికాబద్దంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయా లని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా భద్రాచలం వచ్చిన కలెక్టర్‌ ముందుగా రా మాలయంలో స్వామి వారి దర్శనం చేసుకు న్నారు. అనంతరం దేవస్థానం ఈవో కార్యా లయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి శ్రీరామ నవమికి భక్తులు తరలివస్తారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఎ క్కడా తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలని, జూ ట్‌ బ్యాగుల విషయంలో భక్తులకు అవ గాహన కల్పించాలన్నారు. ప్రసాద కౌంటర్లు, తలంబ్రాల కౌంటర్లు భక్తులకు అందు బాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని, ఇం దుకు స్వచ్చంద సంస్థల సహకారం తీసు కోవాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎటువంటి ఇ బ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చే యాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. త్వరలో జిల్లాస్థాయి  అధికారుల సమా వేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో చర్చిస్తా మన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో జి.నర్సింహులు, ఏఈవో శ్రావణ్‌ కుమార్‌, ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ స్వర్ణలత పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-17T10:57:41+05:30 IST