అమ్మ వద్దు.. ఆస్తి ముద్దు

ABN , First Publish Date - 2020-05-11T10:12:22+05:30 IST

ఆస్తికోసం కన్న కన్నతల్లినే ఇంటినుంచి గెంటేయడంతో ఆ తల్లి మాతృదినోత్సవం రోజున కుమారుడు ఇంటి ఎదుట మౌనపోరాటానికి ..

అమ్మ వద్దు.. ఆస్తి ముద్దు

కన్నతల్లిని గెంటేసిన కుమారుడు

మాతృ దినోత్సవం రోజున అమ్మకు అవమానం

కుమారుడి ఇంటి ఎదుట వృద్ధురాలి మౌనదీక్ష.. పోలీసులకు ఫిర్యాదు  


బూర్గంపాడు, మే 10: ఆస్తికోసం కన్న కన్నతల్లినే ఇంటినుంచి గెంటేయడంతో ఆ తల్లి మాతృదినోత్సవం రోజున కుమారుడు ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన ఆదివరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో జరిగింది. సారపాకకు చెందిన అయిలూరి రంగారెడ్డి, వెంకటకోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారికి వివాహలు కావడంతో జీవితంలో స్థిరపడ్డారు. మూడు నెలల క్రితం రంగారెడ్డి మృతి చెందాడు. నాటి నుంచి కుమారుడు శ్రీనివాసరెడ్డి తన తండ్రి పేరిట ఉన్న ఆస్తికోసం తరుచూ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని భాదితురాలు వెంకటకోటమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.


శుక్రవారం రాత్రి భాదితురాలిని కుమారుడు చితకబాది ఇంటి నుంచి గెంటివేయడంతో గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స ఆందించారు. తరువాత ఇంటికి చేరిన బాధితురాలు ఆదివారం ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. కుమారుడు తరచూ దుర్బాషలాడుతూ కొడుతున్నాడని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధాప్యంలో కంటికి రెప్పటా కాపాడుకోవాల్సిన కొడుకు తల్లిని ఇంటి నుంచి గెంటివేయడం పట్ల శ్రీనివాసరెడ్డి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-05-11T10:12:22+05:30 IST