మోసం చేసిన మహిళపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-12-31T05:24:58+05:30 IST
మోసం చేసిన మహిళపై బుధవారం రఘునాథపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది.

రఘునాథపాలెం డిసెంబరు 30: మోసం చేసిన మహిళపై బుధవారం రఘునాథపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన కల్లూరి విజయనిర్మల మండలంలోని పువ్వాడ ఉదయ్‌కుమార్‌నగర్‌కు చెందిన 30మందితో రూ.6వేలు చెల్లిస్తే సంవత్సరానికి రూ.20వేలు వస్తాయని నమ్మబలికి ఒక లక్షా 80వేల రూపాయలు కట్టించుకుంది. సంవత్సరం గడిచినప్పటికి రూ.20వేలు ఇవ్వకపోగా కనీసం కట్టిన డబ్బులు కూడా ఇవ్వకుండ తప్పించుకోని తిరుగుతుంది. నమ్మించి మోసం చేసిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతు షేక్ షమీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.