మొండికుంటను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-27T05:34:59+05:30 IST

మొండికుంటను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్‌

మొండికుంటను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్‌
ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

అశ్వాపురం నవంబరు 26: అభివృద్ధి పనుల్లో మొండికుంట గ్రామపంచాయతీని  ఆదర్శంగా తీసుకోవాలని  కలెక్టర్‌ ఎంవీరెడ్డి అన్నారు. గురువారం మొండికుంట గ్రామపంచాయతీలో  పర్యటించిన కలెక్టర్‌ అక్కడ జరుగుతున్న  వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా  వైకుంఠధామం, ప్రకృతివనం, డంపింగ్‌యార్డ్‌ పనులను పరిశీలిం చి సంతృప్తి వ్యక్తం చేశారు. అనతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించారు. నీవర్‌ తుఫాన్‌ నేపథ్యంలో  రైతులు  అప్రమత్తంగా  ఉండాలని సూచించారు. అనంతరం  నెల్లిపాకలో  సీసీఐ కేంద్రాన్ని  సందర్శించిన కలెక్టర్‌  కొనుగోళ్లు పారదర్శకం గా సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జేడీఏ అభిమన్యుడు, ఏడీఏ తాతారావు, డీసీ వో మైఖేల్‌ బోస్‌, తహసీల్దార్‌ రామకృష్ణ, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్‌, ఎంపీవోవో శ్రీను, ఏవో శంతన్‌కుమార్‌, మొండికుంట, నెల్లిపాక సర్పంచ్‌లు మర్రి మల్లారెడ్డి, గొర్రెముచ్చు వెంకటరమణ, నెల్లిపాక సింగిల్‌ విండో చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, మొండికుంట ఎంపిటిసి కమటం నరేష్‌ పాల్గొన్నారు.


Read more