భద్రాద్రి రామయ్య సేవలో ప్రముఖులు

ABN , First Publish Date - 2020-12-21T05:09:44+05:30 IST

భద్రాచలం సీతా రామచంద్రస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

భద్రాద్రి రామయ్య సేవలో ప్రముఖులు
రామాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

భద్రాచలం, డిసెంబరు 20: భద్రాచలం సీతా రామచంద్రస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జిల్లా అదనపు జడ్జి బాలభాస్కర్‌ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌ రామయ్యను ద ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దే వస్థానం అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా స్వా గతం పలికారు. ఈ కార్యక్రమంలో ఈవో శివాజీ, ఆ లయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు పాల్గొన్నారు.

దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామయ్యను ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీ్‌షకుమార్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. నారచీరలతోపాటు కుటీరాన్ని సందర్శించి స్థలపురాణాన్ని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-12-21T05:09:44+05:30 IST