‘చింతవర్రె’ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వనమా

ABN , First Publish Date - 2020-12-29T04:47:48+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీలోని చింతవర్రెలో ఇటీవల ఉపాధ్యాయుడి చేతిలో లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినుల కుటుంబాలను సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పరామర్శించారు.

‘చింతవర్రె’ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వనమా
బాధితులను భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ. రెడ్వి వద్దకు తీసుకెళ్లిన ఎమ్మెల్యే వనమా

ఫైల్‌నేమ్‌: 06కేఎంఎం28ఎమ్మెల్యే వనమా

ఫైల్‌వచ్చిన సమయం: 7:10

పంపించిన సమయం: 7:20

కలెక్టర్‌  ద్వారా తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష అందజేత

కొత్తగూడెం, డిసెంబరు 28(ప్రతినిధి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీలోని చింతవర్రెలో ఇటీవల ఉపాధ్యాయుడి చేతిలో లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినుల కుటుంబాలను సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు  పరామర్శించారు. జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్‌ చేశారు. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే తనవెంట జిల్లా కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందించారు. బాధిత విద్యారినులు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేందుకు ఉచితంగా వైద్యసేవలకు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో సదరు విద్యార్థినులు విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. బాధిత కుటుంబాలు మానసికంగా కుంగిపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే సమక్షంలోనే కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాను ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున ఆ కుటుంబాలకు అందవలసిన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌, కొత్తగూడెం సొసైటీ చైర్మన్‌ మండె వీరహన్మంతరావు, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు కొల్లు పద్మ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల ఎంపీపీలు భూక్యా సోనా, బాదావత్‌ శాంతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T04:47:48+05:30 IST