సంక్షేమ పథకాలే టీఆర్‌ఎ్‌సకు బలం: వనమా

ABN , First Publish Date - 2020-12-28T04:23:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎ్‌సకు బలమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎ్‌సకు బలం: వనమా
న్యాయవాది రాధాకృష్ణను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వనమా

చుంచుపల్లి, డిసెంబరు 27 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎ్‌సకు బలమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని విద్యానగర్‌ కాలనీ పంచాయతీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షి స్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణ సా ధించేందుకు అహర్నిశలు పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పని తీరు పట్ల ప్రజలు ఆకర్శితు లవుతూ... పార్టీకి పెద్ద పీటం వేస్తున్నారన్నారు. అనంతరం మాజీ ఎంపీటీసీ, న్యాయవాది పోసాని రాధాకృష్ణను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, ఎంఏ. రజాక్‌, కాసుల వెంకట్‌, ఆళ్ల మురళీ, చుంచుపల్లి, సుజాతనగర్‌, ఎంపీపీలు, బాదావత్‌ శాంతి, భూక్యా విజయలక్ష్మీ, కాసాని శ్రీనివాసరెడ్డి, భాగం మహేశ్వరరావు, ఉమర్‌, ఆరి్‌ఫఖాన్‌, దిశ కమిటీ సభ్యులు గిడ్ల పరంజ్యోతిరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T04:23:36+05:30 IST