క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-18T04:26:23+05:30 IST

కొత్తగూడెం పట్టణంలో ఎ న్నో ఏళ్లుగా ఎదురుగా చూస్తోన్న క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేశామని, త్వరలో రిజిస్ట్రేషన్‌లు చేయిస్తామని కొ త్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.

క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వనమా

త్వరలో రిజిస్ర్టేషన్లు: ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం, డిసెంబరు 17: కొత్తగూడెం పట్టణంలో ఎ న్నో ఏళ్లుగా ఎదురుగా చూస్తోన్న క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేశామని, త్వరలో రిజిస్ట్రేషన్‌లు చేయిస్తామని కొ త్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలను తప్పనిసరిగా అందజేస్తామన్నారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని వెయ్యి మంది లబ్ధిదారులకు కొత్తగూడెం క్లబ్‌లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పం పిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వన మా మాట్లాడుతూ... చిరకాల స్వప్నంగా ఉన్న క్రమ బద్ధీకరణ పట్టాల పంపిణీ చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడ్డాను. ఎంతో శ్రమించాను.. . ఎన్నోసా ర్లు హైదరాబాద్‌ చుట్టూ తిరిగి చివరకు ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేశానన్నారు. త్వరలో మిగిలిన లబ్ధిదారులందరికీ పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ పెద్ద మొత్తంలో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కొత్తగూడెం శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు తన హయాంలోనే జరిగాయన్నారు. పట్టాల పంపిణీ జరగడం తో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గతంలో జీవో ప్రకారం దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన వారందరికీ పట్టాల పంపిణీ జరుగు తుందని, ఎవరు కూడా పట్టా రాలేదని అధైర్య పడొద్దని తెలిపారు. పట్టాల పంపిణీకి వ చ్చిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, పార్టీ నాయకులు, కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. డప్పు నృత్యాలతో, మేళ తాళాలతో స్వాగతించారు. ఎమ్మెల్యే వనమా ఈ సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్‌ సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్‌లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, వైస్‌ చైర్మన్‌ దామోదర్‌, కొత్తగూడెంతహసీల్దార్‌ రవికుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వనమా రాఘవేం ద్రరావు, ఎంఏ. రజాక్‌, కాసుల వెంకట్‌, సత్యనారాయణ సింగ్‌ (సత్తు భయ్య), మునిసిపల్‌ కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-18T04:26:23+05:30 IST