మంత్రుల పర్యటన సాగిందిలా..
ABN , First Publish Date - 2020-12-08T05:19:22+05:30 IST
హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియానికి చేరుకున్న మంత్రులకు ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోతు హరిప్రియ, రాములునాయక్, తదితరులు ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియానికి చేరుకున్న మంత్రులకు ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోతు హరిప్రియ, రాములునాయక్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురు నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహార విందు స్వీకరించారు. ఆ తర్వాత ఖానాపురం మినీట్యాంక్‌బండ్, బల్లేపల్లి వైకుంఠదామం, రఘునాధపాలెం ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించి అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం ఖానాపురం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నెస్పీ వాక్‌వే, ఇందిరానగర్ కేఎంసీ పార్కును ప్రారంభించారు. అనంతరం లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ధంసలాపురం చేరుకుని రైల్వే ఓవర్‌బ్రిడ్జిని ప్రారంభించారు. అక్కడ కూడలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతన పోలీసుమిషనరేట్ భవనాన్ని, గోళ్లపాడు ఛానల్ వద్ద నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్యపార్కును ప్రారంభించారు. అనంతరం ఇల్లెందు క్రాస్‌రోడ్డులో నిర్మించిన ఐటీహబ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఐటీహబ్‌లోని విభాగాలను పరిశీలించి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన ఆయా కంపెనీల సీఈవోలతో మాట్లాడి ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అనంతరం ఐటీహబ్ ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించారు.
- నెట్‌వర్క్