ఐటీహబ్ రెండో దశ నిర్మాణం చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-11T04:39:38+05:30 IST
ఐటీహబ్ రెండో దశ నిర్మాణం చేపట్టాలి

కేటీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం)
ఖమ్మంలో ఐటీహబ్ రెండో దశ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాదులో మంత్రి పువ్వాడ కేటీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో ప్రారంభించిన ఐటీహబ్‌కు విశేషస్పందన లభిస్తుందని, పలు సాప్ట్‌వేర్ కంపెనీలు ఖమ్మంలో బ్రాంచీలు నెలకొల్పేందుకు వస్తున్నాయని, వారి అభ్యర్థన మేరకు రెండో దశ నిర్మాణం చేపట్టాలని, పువ్వాడ కేటీఆర్‌కు సూచించారు. టెక్నోజన్ అధినేత ల్యాప్స్ చేకూరి కూడా ఖమ్మం ఐటీ హబ్‌కున్న ఆదరణ గురించి వివరించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి పువ్వాడ ఒక ప్రకటనలో తెలిపారు.