ఖమ్మం మునిసిపాలిటీ ఆదర్శం
ABN , First Publish Date - 2020-12-12T04:31:31+05:30 IST
ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధిలో ఇతర నగరపాలక, పురపాలక సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కొనియాడారు.
తడి, పొడి చెత్త సేకరణ ఉద్యమంలా సాగాలి
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం కార్పొరేషన్, డిసెంబరు11: ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధిలో ఇతర నగరపాలక, పురపాలక సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో తడి, పొడి చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఐదు బ్యాటరీ వాహనాలను శుక్రవారం పెవిలియన్ గ్రౌండ్‌లో మంత్రి ప్రారంభించారు. తడి, పొడి చెత్త సేకరణ ఉద్యమంలా సాగాలని, నూతన ఏడాది నుంచి పూర్తి స్వచ్ఛ ఖమ్మంగా మారాలని ఆకాక్షించారు. అనంతరం నగరపాలక సంస్థ సమకూర్చిన 2 లక్షల తడి,పొడి చెత్తబుట్టల పంపిణీలో భాగంగా 31వ డివిజన్ ప్రజలకు మంత్రి బుట్టలు అందచేశారు. నగరంలోని 77వేల ఇళ్లనుండి తడి, పొడి చెత్త సేకరణ జరిగే విధంగా, ముఖ్యంగా గృహిణులను చైతన్య పరిచే బాధ్యత మెప్మా, నగరపాలక సంస్థ సిబ్బందిదే నన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్‌కు తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు వాహనాలను ఏర్పాటు చేస్తామని పువ్వాడ తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆర్‌వీ. కర్ణన్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తను విడి విడిగా సేకరించేందుకు ప్రత్యేకంగా బ్యాటరీ వాహ నాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే డ్రైవేస్ట్ రీసోర్స్ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కో న్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ జీ.పాపాలాల్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, సహయ కమిషనర్ బీ. మల్లేశ్వరి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, సీతమ్మ పాల్గొన్నారు.
కళాశాల పరిపాలనా భవనానికి శంకుస్థాపన
ఖమ్మంఎడ్యుకే.షన్:నగరంలోని ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీకళాశాల పరిపాలన భవనానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కళాశాలఅభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కళాశాల పూర్వ విద్యార్థిగా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బొటానికల్ గార్డెన్‌కు కృషి చేస్తా నన్నారు. ఆడిటోరియంలోజాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించుకునేలా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మేయర్ పాపాలాల్, ప్రిన్సిపాల్ రత్నప్రసాద్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, కార్పొరేటర్ చావా నారాయణరావు పాల్గొన్నారు.
సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
నగరంలోని 39వ డివిజన్‌లో రూ.70లక్షలతో నిర్మిస్తున్న సీసీ రహదారికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ జీ. పాపాలాల్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతి, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్ పాలడుగు పాపారావు, టీఆర్‌ఎస్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ గుండాల కృష్ణ, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.