సీఏం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

ABN , First Publish Date - 2020-06-04T09:30:42+05:30 IST

మండలంలోని జింకలతండా క్రాస్‌రోడ్‌ వద్ద గిరిజనుల ఆరాధ్యదైవం సంతుసేవాలాల్‌ దేవాలయాన్ని రవాణశాఖా

సీఏం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

రఘునాథపాలెం జూన్‌3: మండలంలోని జింకలతండా క్రాస్‌రోడ్‌ వద్ద గిరిజనుల ఆరాధ్యదైవం సంతుసేవాలాల్‌ దేవాలయాన్ని రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సొంత ఖర్చులతో నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో గిరిజన నాయకులు బుధవారం సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.  ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాళోత్‌ ప్రియాంక, ఎంపీపీ భూక్యా గౌరి, మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌ భానోత్‌ ప్రమీల, ఆత్మకమిటి సభ్యుడు సూర్య, లాలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:30:42+05:30 IST