మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-31T04:44:27+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు.

మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ ధ్యేయం
ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

కొత్తగూడెం, డిసెంబరు 30: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రూ.34లక్షలతో ఏర్పాటుచేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌, ప్రగతి మైదానంలో రూ.15లక్షలతో నిర్మించిన వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌లను, రూ.1.60కోట్లతో కొనుగోలుచేసిన 35 స్వచ్ఛ ట్రాలీ వా హనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఆక్సిజన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రధాన ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి రోజు సిలిండర్ల కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్లాంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిలిండర్ల కొరత లేకుండా సేవలకు ఆస్పత్రికి వచ్చే రోగులకు ఈ ప్లాంట్‌ ద్వారా ఆక్సిజన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రగతి మైదానంలో అమరవీరులకు నివాళులర్పించి రూ.15లక్షలతో ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌లను మంత్రి ప్రారంభించి కొద్దిసేపు వాకింగ్‌ చేశారు. జిల్లా ప్రజలకు మంచి మైదా నాన్ని అందుబాటులోకి తెచ్చారని కలెక్టర్‌ను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌ నాయక్‌, ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రుల పర్యవేక్షకులు డాక్టర్‌ సరళ, మునిసిపల్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

శిక్షణను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

విద్యార్థులు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు సాధించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి తెలిపారు. బుధవారం కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నేషనల్‌ అకాడమీ ఫర్‌ కన్‌స్ట్రక్షన్‌ ద్వారా సర్వేయర్‌, ఎలక్ట్రిషియన్‌, సూపర్‌వైజర్‌, నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్న 82 మంది విద్యార్థులతో కలెక్టర్‌ ము ఖాముఖి నిర్వహించారు. శిక్షణ పొందుతున్న తీరును వి ద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 


Updated Date - 2020-12-31T04:44:27+05:30 IST