వలస కూలీలకు భరోసా ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-04-01T11:09:46+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుం డడంతో వలస కూలీలకు అధికారులు భరోసా కల్పించాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సూ చిం చారు.

వలస కూలీలకు భరోసా ఇవ్వాలి

 అధికారులకు భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీరెడ్డి సూచన


జూలూరుపాడు/కొత్తగూడెం కలెక్టరేట్‌ మార్చి31: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుం డడంతో వలస కూలీలకు  అధికారులు భరోసా కల్పించాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సూ చిం చారు. మంగళవారం మండలంలోని కాకర్లను ఆయన సం దర్శించారు. ఈ సందర్భంగా వలస కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలు సుకున్నారు. వైద్య పరీక్షలు చేయలేదని, అఽధికారులు ఎవరూ తమ వద్దకు రాలేదని వారు చెప్పడంతో తహసీల్దార్‌, వైద్యాధికారిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కూలీలు నివసిస్తున్న ఆవాసాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి స్ర్కీనింగ్‌ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కొర్ల విజయ్‌కుమార్‌, ఎంపీడీవో దేవకరుణ, మండల పంచాయతీ అధికారి పుల్లూరి జగదీశ్వరరావు, వైద్యాధికారి పుష్పలత, సర్పంచ్‌లు రమా దేవి, మోహన్‌రావు, ఎంపీటీసీ పొన్నెకంటి వీరభద్రం పాల్గొన్నారు. 


అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

కలెక్టర్‌ మంగళవారం వలస కూలీల సమస్యలను తెలుసుకునేందుకు కా కర్లకి వస్తుండడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులువలస కూలీలందరిని ఒ కే చోట కూర్చోబెట్టడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెం దు తుండడంతో ప్రభుత్వం భౌతిక దూరాన్ని పాటించాలని చెబుతున్నా కూలీ లను గుంపుగా ఎలా కూర్చొబెట్టారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.  తాము కూలీలకు మీటర్‌ దూరంలో కూర్చోవాలని చెప్పామని అధికారులు కలెక్టర్‌కు చెప్పబోగా కథలు చెప్పొదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 


స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలి

ఢిల్లీ నిజాముద్దీన్‌ పరిధిలోని మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వ చ్ఛందంగా తమ సమాచారాన్ని కంట్రోల్‌ రూం నెంబర్‌కు ఫోన్‌ చేసి జిల్లా అధికా రులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  ప్రార్థనలో పాల్గొన్న కొందరికి కరోనా వైరస్‌ సోకినట్లు స మాచారం ఉందని, ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 10మందిని క్వారం టైన్‌కు తర లించామన్నారు. వీరికి ఉచితంగా చికిత్స అందజేస్తుందన్నారు. ప్రార్థనలో పాల్గొన్న వారు ఎవరైనా సమీపంలో ఉంటే కంట్రోల్‌ రూంకు నెం. 087442419 50, 9392305104, 9392 307840, 100కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు..


మణుగూరు క్వారంటైన్‌ కేంద్రానికి ఉపవైద్యాధికారి నియామకం

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు క్వారంటైన్‌ కేంద్రానికి ఉప వైద్యాధికారిగా డాక్టర్‌ నరేష్‌ను నియమించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య స్థితి గురించి ప్రతి రోజూ తనకు నివేదికను సమర్పించాలన్నారు.

Updated Date - 2020-04-01T11:09:46+05:30 IST