ఓటు నమోదుకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-11-28T04:10:12+05:30 IST

జిల్లాలోని అర్హత ఉన్న ప్రతి వయోజనులూ ఓటరుగా నమోదు అయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక సెక్రటరీ ఈ శ్రీధర్‌ కోరారు.

ఓటు నమోదుకు సహకరించాలి
మాట్లాడుతున్న శ్రీధర్‌, పక్కన కలెక్టర్‌ కర్ణన్‌

అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి

ఎలకో్ట్రరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ సెక్రటరీ శ్రీధర్‌

జాబితా ప్రత్యేక క్యాంపెయిన్‌పై సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు27: జిల్లాలోని అర్హత ఉన్న ప్రతి వయోజనులూ ఓటరుగా నమోదు అయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక సెక్రటరీ ఈ శ్రీధర్‌ కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక క్యాంపెయిన్‌పై ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.  జిల్లాలో ఓటరు జాబితా సవ్యంగా ఉందన్నారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా స్పెషల్‌ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని ఆయన కోరారు.ఓటరు జాబితా ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ను చేపడుతోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల యంత్రాంగం తో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక భూమికను పోషించాలన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన ్న బూత్‌ లెవల్‌ వరకు ఓటరు జాబితాను అందించి నూతన నమోదుతో పాటు అవసరమైన మార్పులు చేర్పులు, తొలగింపులను ఫారం 6,7,8,8ఏలతో దరఖాస్తులను అందించాలని కోరారు. ఓటరు జాబితాలో తొలగింపులను ఎన్నికల అధికారులు ఫారం-7 అందిన దరఖాస్తుల ఆధారంగానే తొలగింపు ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు. 2021 జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన వారు కూడా ఓటరుగా నమోదు కాని వారు తమ పేరును ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ను చేపడుతుందన్నారు. ఈనెల 21,22 తేదీల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించా మని,  డిసెంబర్‌ 5,6 తేదీల్లో రెండు విడతలుగా స్పెషల్‌ క్యాంపెయిన్‌ ఉంటుందన్నారు. స్పెషల్‌ క్యాంపెయిన్‌ ద్వారా అందిన క్లెయింలను అభ్యంతరాలను డిసెంబర్‌ 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2021 జనవరి 5న పరిశీలించి, 15న తుది జాబితాను వెల్లడించనున్నట్లు శ్రీధర్‌ తెలిపారు.

1363 పోలింగ్‌ కేంద్రాలు: కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌

జిల్లాలో ఐదునియోజకవర్గాల్లో 1363 పోలింగ్‌ కేంద్రాలు, 694 పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. జిల్లా జనాభా 14లక్షల 99వేల 694 కాగా 11లక్షల 28వేల 562 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు.  పార్లమెంట్‌ ఎన్నికల్లో, అత్యధిక ఓటింగ్‌శాతం నమోదు, అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘం నుంచి డెమెక్రసీ అవార్డు కూడా జిల్లాకు లభించిందని కలెక్టర్‌ గుర్తు చేశారు. ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఐదు నియోజకవర్గాల ఎలక్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ అధికారులు అనురాగ్‌ జయంతి, ఆర్‌ దశరథ్‌, ఆర్‌ శిరీష, సిహెచ్‌ సూర్యనారాయణ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ నుంచి జి విద్యాసాగర్‌, టీఆర్‌ఎస్‌ నుంచి జి కృష్ణ, సీపీఐ నుంచి తాటి వెంకటేశ్వరరావు, సీపీఎం నుంచి యరబోలు శ్రీనివాసరావు, బీఎస్పీ నుంచి బి ఉపేందర్‌ సాహు, టీడీపీ నుంచి జి సీతయ్య, కాంగ్రెస్‌ నుంచి ఎం నరేందర్‌ పాల్గొన్నారు. 

Read more